లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. తెల్లకార్డుదారులకు వెంటనే ఉచితంగా రేషన్‌తో పాటు నగదు సాయం చేయాలన్నారు. రెక్కాడితే గానీ డొక్కాడనివారు చాలామంది ఉంటారని..., అలాంటి వాళ్లు ఇబ్బంది పడకుండా చూడాలని కోరారు. రద్దీ ఎక్కువగా ఉంటున్న మద్యం దుకాణాలు, బార్లు మూసివేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు అందించే వాలంటీర్ల ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉన్నందున... వారు తగిన జాగ్రత్తలతో ఇళ్ల వద్దకు వెళ్లేలా చూడాలన్నారు. లేకపోతే వృద్ధులు ఇబ్బంది పడే ప్రమాదం ఉందన్నారు.
'తెల్లకార్డుదారులకు రేషన్‌తో పాటు నగదు సాయం చేయాలి' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వార్తలు
రాష్ట్రంలో పేదవర్గాలకు సీఎం జగన్ సాయం చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. తెల్లకార్డుదారులకు రేషన్‌తో పాటు నగదు సాయం చేయాలని కోరారు.
bjp-kanna-letter-to-cm-jagan