'స్వప్రయోజనాల కోసం వైకాపా ..మోదీని అడ్డు పెట్టుకుంటుంది' - తెదేపా, వైకాపా ప్రభుత్వాలు దొందూదొందే
తమ స్వప్రయోజనాల కోసమే వైకాపా...మోదీని అడ్డం పెట్టుకోవటానికి యత్నిస్తోందని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెదేపా, వైకాపా పార్టీలు దొందూదొందే...అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
bjp kanna
తెదేపా,వైకాపా ప్రభుత్వాలు దొందూదొందే అంటూ భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్‌లో విమర్శించారు.విపరీతమైన అవినీతితో కేంద్ర నిధులు మాయం చేసింది ఆనాటి తెదేపా ప్రభుత్వమని ఆరోపించారు.ప్రధాని మోసం చేశారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు.ప్రస్తుత వైకాపా ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం ప్రధానిని అడ్డం పెట్టుకోవటానికి యత్నిస్తోందని అన్నారు.వైకాపా ప్రభుత్వం తనకే నమ్మకం లేక ఇలా వ్యవహరిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు.