ఇకపై కలిసి పని చేయాలని భాజపా-జనసేన నేతలు నిర్ణయించారు. దిల్లీలోని ఎంపీ జీవీఎల్ నివాసంలో భేటీ అయిన ఇరు పార్టీల నేతల ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న రాజధాని రగడపై పోరాటం చేస్తామని ప్రకటించారు. ఈనెల 28న విజయవాడలో సమావేశం కానున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతి 15 రోజులకు ఒకసారి జనసేనతో సమావేశమవుతామని చెప్పారు.
ఫిబ్రవరి 2న లాంగ్ మార్చ్: నాదెండ్ల
అమరావతి రైతులకు అండగా నిలబడతామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. భూములు త్యాగం చేసిన రైతులపై ప్రభుత్వం వైఖరి సరికాదన్న ఆయన... ఫిబ్రవరి 2న తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహించనున్నామని తెలిపారు. వైకాపా నాయకులు రాజకీయాలను తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.