ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేరే పార్టీకి గాజు గ్లాస్ గుర్తుపై.. సీఈసీకి భాజపా - జనసేన ఫిర్యాదు - గాజుగుర్తు వ్యవహారం

తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన గుర్తును మరో పార్టీకి కేటాయించటంపై భాజపా-జనసేన నేతల బృందం సీఈసీకి ఫిర్యాదు చేశాయి.

BJP-Jana Sena leaders complaint to the CEC
సీఈసీకి భాజపా-జనసేన నేతల బృందం ఫిర్యాదు

By

Published : Apr 5, 2021, 9:46 PM IST

Updated : Apr 5, 2021, 9:52 PM IST

వేరే పార్టీకి గాజు గ్లాస్ గుర్తుపై.. సీఈసీకి భాజపా - జనసేన ఫిర్యాదు

కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా - జనసేన నేతల బృందం కలిసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో వేరే పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై అభ్యంతరం తెలుపుతూ... సీఈసీకి ఫిర్యాదు చేసింది.

కోడ్ అమల్లో ఉండగా..ప్రకటన ఎలా ఇస్తారు?: జీవీఎల్

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రకటనపై భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరుపతి ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే పరిషత్‌ ఎన్నికల ప్రకటన ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పరిషత్‌ ఎన్నికల వేళ... తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి ఆటంకం ఏర్పడుతోందని చెప్పారు. అన్ని అంశాలపై సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.

మరో పార్టీకి జనసేన గుర్తుపై ఫిర్యాదు: నాదెండ్ల

జనసేన గుర్తును తిరుపతి ఉప ఎన్నికల్లో మరో పార్టీకి ఇవ్వడంపై ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. తమ ఫిర్యాదుపై ఈసీ సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని మనోహర్‌ అన్నారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఉప ఎన్నిక: నారా లోకేశ్ విస్తృత ప్రచారం

Last Updated : Apr 5, 2021, 9:52 PM IST

ABOUT THE AUTHOR

...view details