ఆత్మకూరు ఉప ఎన్నికలో భాజపా, జనసేన బలపరిచిన అభ్యర్థిని పోటీలో నిలబెడతామని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి అంటే ప్రజల సొమ్మును వారికే పంచి ఓట్లు కొనుక్కోవడమా? అని గురువారం ఓ ప్రకటనలో సీఎం జగన్‌ను ప్రశ్నించారు. ‘‘ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాలపై హక్కు యాజమాన్యాలదే అని హైకోర్టు తీర్పు ఇస్తే.. వాటి ఆస్తులపై ప్రభుత్వానిదే అధికారమని దేవాదాయ శాఖ మంత్రి ఎలా అంటారు. భాజపా అధికారంలోకి వస్తే చర్చిలు, మసీదుల మాదిరిగానే దేవాలయాలను స్వేచ్ఛగా ఉంచుతాం’’ అని విష్ణువర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.
ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీపై.. బీజేపీ ప్రకటన - బీజేపీ
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ ఆయిన ఆత్మకూరు నియోజక వర్గం ఉప ఎన్నికలో పోటీపై.. భారతీయ జనతా పార్టీ ప్రకటన చేసింది. పోటీలో ఉంటున్నామా? లేదా అన్న అంశంపై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ఖువర్ధన్ ప్రకటన చేశారు.
atmakuru by poll
భాజపా అభ్యర్థిగా భరత్!
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి భాజపా తరఫున ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు భరత్ పేరును ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం నుంచి దిల్లీకి ప్రతిపాదన వెళ్లినట్లు తెలిసింది.