దుబ్బాకలో ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. చివరి వరకు ఉత్కంఠ రేకెత్తించిన ఈ ఎన్నికల పోరులో భాజపా విజయభేరి మోగించింది. తెరాస అభ్యర్థి సుజాతపై భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. తెరాసపై 1068 ఓట్ల మెజార్టీతో భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. రెండో స్థానంలో తెరాస, మూడో స్థానంలో కాంగ్రెస్ నిలిచాయి.
BJP candidate Raghanandan Rao won in dubbaka
By
Published : Nov 10, 2020, 10:13 AM IST
|
Updated : Nov 10, 2020, 4:10 PM IST
తెలంగాణ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. అధికార తెరాస.. ప్రత్యర్థి భాజపా మధ్య నువ్వా నేనా అన్నట్టుగా హోరాహోరీ పోటీ సాగింది.. రౌండ్ రౌండ్ కూ ఆధిక్యం ఇరు పార్టీల అభ్యర్థులనూ దోబూచులాడుతోంది. చివరకు విజయం భాజపాను వరించింది.
23 మంది అభ్యర్థులు పోటీపడిన దుబ్బాకలో విజేత ఎవరో తేలిపోయింది.భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు విజయం సాధించారు. కొవిడ్-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుని...లెక్కించారు. రెండు హాళ్లలో ఏడేసి చొప్పున 14 టేబుళ్లు ఏర్పాటు చేసి...5 వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించారు. ఈవీఎంలు మొరాయించిన పక్షంలో వీవీ ప్యాట్లలోని స్లిప్పులను పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 3న జరిగిన పోలింగ్‌లో 1,64,192 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 82.61 శాతం పోలింగ్ నమోదైంది.
దుబ్బాక ఉపఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. ప్రధానంగా తెరాస, భాజపా నేతల మధ్య మాటల యుద్ధంతో రాజకీయంగా వేడి రగిలింది. తెరాస నుంచి సోలిపేట సుజాత, భాజపా నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పోటీకి దిగిన విషయం తెలిసిందే. చివరకు భాజపా అభ్యర్థి రఘనందన్‌రావు విజయఢంకా మోగించారు.