తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ఆయా పార్టీల అభ్యర్థులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత తన స్వగ్రామమైన చిట్టాపూర్‌లో ఓటేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని సుజాత ధీమా వ్యక్తం చేశారు.
దుబ్బాక ఉపఎన్నిక: చిట్టాపూర్‌లో సుజాత.. బొప్పాపూర్‌లో రఘునందన్‌రావు - దుబ్బాక ఉప ఎన్నికలు
తెలంగాణ దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత, భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
![దుబ్బాక ఉపఎన్నిక: చిట్టాపూర్‌లో సుజాత.. బొప్పాపూర్‌లో రఘునందన్‌రావు dubbaka by election in boppapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9409022-826-9409022-1604372520909.jpg)
dubbaka by election in boppapur
భాజపా అభ్యర్థి రఘునందన్ రావు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన బొప్పాపూర్‌లో పోలింగ్ స్టేషన్ నంబర్ 17లో ఓటు వేశారు. ఈ ఉపఎన్నికలో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రఘునందన్‌రావు నియోజకవర్గ ఓటర్లను వేడుకున్నారు.