Somu Veerraju slams YCP Govt: కేంద్రం నిధులు ఇస్తుంటే.. జగన్ తన సొంత పథకాల పేరుతో ప్రచారం చేసుకుంటున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో స్థానిక నాయకులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సోము మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిర్మిస్తున్న జగన్ కాలనీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నాయని స్పష్టం చేశారు. దాదాపు 35 వేల కోట్ల రూపాయలు పేదల ఇళ్ల కోసం ఇస్తున్నామని చెప్పారు. అయితే.. కేంద్రం నిధులు ఇస్తుండగా, వాటికి పేరు మాత్రం జగన్ పెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.