ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాని మోదీ రైతు పక్షపాతి: విష్ణువర్ధన్ రెడ్డి - AP BJP latest news

ప్రధాని మోదీ రైతు పక్షపాతిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని... భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Vishnu
Vishnu

By

Published : Jun 4, 2020, 2:37 PM IST

అన్నదాత పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకునే హక్కులు కల్పించడం చారిత్రక నిర్ణయమని… భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. రైతుకు తాను పండించిన పంట విషయంలో 70 ఏళ్ల తర్వాత నిజమైన స్వాతంత్య్రం లభించిందని అభిప్రాయపడ్డారు. పంట నిల్వల చట్టం 1955ను సవరిస్తూ... దేశంలో ఎక్కడైనా రైతు స్వేచ్ఛగా పంటను అమ్ముకునే వెలుసుబాటు కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ నిర్ణయంతో ప్రధాని నరేంద్ర మోదీ రైతు పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల కోసం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మోదీ, కేంద్ర కేబినెట్ కు, వ్యవసాయ శాఖ మంత్రికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details