ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

RRR: ప్రగతి భవన్ వద్ద 'ఆర్​ఆర్​ఆర్​' హల్​చల్.. ఉద్రిక్తత - భాజపా కార్యకర్తల హల్​చల్

తెలంగాణ రాష్ట్ర ప్రగతిభవన్​ వద్ద భాజపా కార్యకర్తలు హల్​చల్ చేశారు. ఆర్ఆర్ఆర్(RRR) ’ స్టిక్కర్​ అంటించిన వాహనంతో ప్రగతిభవన్​కు వచ్చారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

bjp-activists-halchal-with-rrr-poster-at-pragathi-bhavan-in-hyderabad-today
ప్రగతిభవన్ వద్ద 'ఆర్​ఆర్​ఆర్​' హల్​చల్.. ఉద్రిక్తత

By

Published : Nov 3, 2021, 7:29 AM IST

తెలంగాణలోని హుజూరాబాద్​లో భాజపా అభ్యర్థి ఈటల విజయంతో ప్రగతిభవన్​ వద్ద కార్యకర్తలు హల్​చల్ సృష్టించారు. ఆర్ఆర్ఆర్(RRR) సినిమా స్టిక్కర్​ను అంటించిన వాహనంతో భాజపా కార్యకర్తలు ప్రగతిభవన్‌కు వచ్చారు. ఆ వాహనంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ ఫోటోలు ఉన్నాయి.

సీఎం కేసీఆర్ ఆర్​ఆర్ఆర్ సినిమా చూడాలంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ప్రగతిభవన్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే భాజపా కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం భాజపా కార్యకర్తలు బల్కంపేటలోని ఎల్లమ్మ గుడిలో మొక్కులు చెల్లించేందుకు వెళ్లారు. అయితే ఇటీవల నవంబర్‌ 2న ప్రగతిభవన్ వద్ద ఆర్ఆర్ఆర్ సినిమా చూపిస్తామని బండి సంజయ్‌ అనడంతో ఇవాళ భాజపా కార్యకర్తలు ప్రగతిభవన్‌కు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details