ఇదీ చదవండి:
Kavitha Birthday: ఎమ్మెల్సీ కవిత బర్త్డే.. అరేబియా సముద్రంలో వినూత్నంగా విషెష్ - mlc kavitha birthday
Birthday wishes to MLC Kavitha: నేడు తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు ఆమెకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా తెరాస పార్టీ నాయకుడు చిన్ను గౌడ్.. మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన.. అరేబియా సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కవిత ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని కోరారు. ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేసినట్లు చిన్నూ గౌడ్ తెలిపారు.
బర్త్డే విషెష్
Last Updated : Mar 13, 2022, 1:06 PM IST