గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల హాజరుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వారికి బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని నిర్ణయించి.. ఆ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులూ... హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందు కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5.30గంటకు బయోమోట్రిక్ విధానంలో హాజరు నమోదు చేయనున్నారు.
సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానం - ఏపీలో గ్రామ సచివాలయాల వార్తలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు.. బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
![సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానం Biometric Attendance to ap grama ward Secretariat Employees](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6028078-905-6028078-1581350428959.jpg)
Biometric Attendance to ap grama ward Secretariat Employees