రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇందులో ఆయా శాఖాపరమైన ఉద్యోగాలను ఏర్పాటుచేసి భర్తీచేశారు. సచివాలయ ఉద్యోగులు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అనుసరించాల్సి ఉంది. బయోమెట్రిక్ హాజరు ద్వారానే వారి వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
సెప్టెంబర్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు - సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు వార్తలు
సెప్టెంబర్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకనుంచి దాని ఆధారంగానే వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఎంపీడీవో మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది.
సెప్టెంబర్ 1 నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు