ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒక్క బైక్​ కాదు.. వంద బండ్లు కొట్టేశాడు..!

ద్విచక్ర వాహనం కొట్టేయడంలో అతడు దిట్ట... ఎక్కడ బైకు కనిపించినా క్షణాల్లో మాయం చేస్తాడు... ఒకచోట అపహరించిన వాహనాన్ని మరోచోట తెలివిగా అమ్మేస్తాడు.. ఇలా ఒకటి రెండు కాదు.. ఏకంగా 111 ద్విచక్రవాహనాలు ఇలా దొంగిలించి ఇతరులకు విక్రయించాడు ఓ ఘరానా దొంగ..! కానీ.. ప్రతిసారీ ప్లాన్ సక్సెస్ కాదు కదా..! ఇక్కడా అదే జరిగింది.. బెడిసి కొట్టింది.. ఖేల్ ఖతం.. దుక్నం బంద్.

బైకుల చోరీలో సెంచరీ
బైకుల చోరీలో సెంచరీ

By

Published : Jun 25, 2022, 8:39 AM IST

Updated : Jun 25, 2022, 4:10 PM IST

అతని కన్ను పడిదంటే ద్విచక్ర వాహనం మాయమవుతుంది. కొట్టేయడం.. అమ్మేయడం.. అతనికి వెన్నతో పెట్టిన విద్య. అలా కొట్టేసిన వాటి సంఖ్య.. ఇప్పటివరకు 111కు చేరింది. తమకు అందిన సమాచారంతో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిశాలలో సీఐ బి.సూర్య అప్పారావు, ఎస్‌ఐ టి.రఘునాథరావులు విచారణ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఏలేశ్వరానికి చెందిన నడిగట్ల కృష్ణ... జగ్గంపేటలో నివాసం ఉంటున్నాడు. చోరీలు చేయడమే పనిగా పెట్టుకున్నాడు. తణుకు, మండపేట, రాజమహేంద్రవరం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను అపహరించి జగ్గంపేట మండలం గోవిందపురం, రాజపూడి, కృష్ణపురం, మన్యంవారిపాలెం, మల్లిశాల తదితర గ్రామాల్లో తక్కువ ధరకు విక్రయించేవాడు. గోవిందపురానికి చెందిన వ్యక్తి ఒకరు ఇతని వద్ద ఏకంగా 15 బైకులు కొని, సొమ్ము చేసుకున్నట్లు సమాచారం.

ఇతన్నుంచి వాహనాలను కొనుగోలు చేసిన వారికి పోలీసులు ఫోన్లు చేస్తుండటంతో.. ఒక్కొక్కరుగా వాటిని పోలీసుస్టేషన్‌కు తీసుకొస్తున్నారు. మరికొందరైతే బైకులను ఠాణా పరిసరాల్లో పెట్టేసి నెమ్మదిగా జారుకుంటున్నారు. వాహనాల చోరీ వ్యవహారంలో మరో నిందితుడు తెలంగాణలోని ఖమ్మం సబ్‌జైలులో వేరే నేరంలో శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇవీ చదవండి:

Last Updated : Jun 25, 2022, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details