ఓ ద్విచక్రవాహనంలో ఊహించని విధంగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా బైక్‌లో మంటలు రావడంతో వాహనదారుడు వెంటనే అప్రమత్తమై ఆర్పేందుకు యత్నించాడు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ చౌరస్తాలోని పెట్రోల్ బంక్ వద్ద జరిగింది.
తెలంగాణ: మంటల్లో ద్విచక్రవాహనం.. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వాహనదారుడు - బైక్ ఫైర్ యాక్సిడెంట్
ద్విచక్రవాహనంలో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనదారుడు వెంటనే అప్రమత్తమై కిందకు దిగి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఈ ఘటన తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బండ్లగూడ చౌరస్తాలోని పెట్రోల్ బంక్ వద్ద జరిగింది.
బైక్ నుంచి మంటలు
ప్రమాదం జరిగిందిలా..
హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్ కాచిగూడ నుంచి గండిపేట్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అతను ప్రయాణిస్తున్న సమయంలో పెట్రోల్ పైపు లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన వెంటనే పక్కనే ఉన్న పెట్రోల్ బంకు సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ద్విచక్రవాహనం సగానికి పైగా మంటల్లో కాలిపోయింది.