Bike Accident At Rayadurgam Fly over: భాగ్యనగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గచ్చిబౌలిలో పనిచేసే ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు.
ఏం జరిగిందంటే..

Rayadurgam Accident Today : కర్నూలుకు చెందిన ప్రీతమ్ భరద్వాజ్ నగరంలోని పద్మారావు నగర్లో నివాసం ఉంటూ గచ్చిబౌలిలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకుని బైకుపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రాయదుర్గం షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి కిందపడి మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదుపు తప్పి వంతెన పైనుంచి కిందపడ్డాడా లేక ఏదైనా వాహనం ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:
Road accident: గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి