తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మధ్య మానేరు ప్రాజెక్టులో మత్స్యకారులకు 26 కిలోల భారీ చేప చిక్కింది. గత పది రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.
Big fish: చిక్కిన భారీ చేప.. స్థానికుల ఆసక్తి - రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్యకారుల వలకు భారీ చేప(Big fish) చిక్కింది. ఇంత భారీ చేప లభించడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఆ ఫిష్ బరువు 26 కిలోలు ఉంటుందని మత్స్యకారులు పేర్కొన్నారు. గత 10 రోజులుగా ఈ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువ మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మధ్య మానేరు ప్రాజెక్టు గేట్ల దిగువన జల ప్రవాహానికి భారీగా చేపలు వస్తున్నాయి.
big-26-kg-fish
మధ్య మానేరు ప్రాజెక్టు గేట్ల దిగువన జల ప్రవాహానికి భారీగా చేపలు వచ్చి చేరుతున్నాయి. దీంతో సమీప గ్రామాల నుంచి మత్స్యకారులు చేరుకుని చేపలు పడుతున్నారు. ఈ క్రమంలో మాన్వాడకు చెందిన బత్తిని సంపత్, పర్శరాంలకు ఆదివారం రోజున ఏకంగా 26 కిలోల భారీ చేప చిక్కింది. ఆ చేపను ఉత్సాహంగా తమ గ్రామానికి తీసుకెళ్లారు. దానిని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
ఇదీ చూడండి: