ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్క తప్పు చేసిందని పోలీసులు ఎలా చెప్తారు: భూమా మౌనిక - Bhuma Akhila arrest

అఖిలప్రియ ఆరోగ్యం ఏమాత్రం బాగా లేదని... ఆమె సోదరి భూమా మౌనిక ఆందోళన వ్యక్తం చేశారు. అక్క తప్పు చేసిందని పోలీసులు ఎలా చెప్తారని ఆమె ప్రశ్నించారు. ఆస్తుల కోసం ఇంతగా వేధిస్తారా... ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌ వచ్చినవారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఓటేయలేదా అని ప్రశ్నించారు

Bhuma Mounika press conference on Akhila arrest
భూమా మౌనిక

By

Published : Jan 8, 2021, 6:57 PM IST

Updated : Jan 8, 2021, 7:41 PM IST

తన అక్క అఖిలప్రియ ఆరోగ్యం ఏమాత్రం బాగా లేదని ఆమె సోదరి భూమా మౌనిక ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు లేరని మమ్మల్ని వేధిస్తున్నారని వాపోయారు. అక్క తప్పు చేసిందని పోలీసులు ఎలా చెబుతారని...పోలీసులే జడ్జిమెంట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అక్కపై ఆరోపణలకు కాల్‌ రికార్డులు లేవు, వీడియో రికార్డులు లేవని... ఒక టెర్రరిస్టులా అక్కను తీసుకెళ్లారని ఆరోపించారు. మీడియాను కూడా తప్పుదోవ పట్టించారని మౌనిక తెలిపారు.

భూమా మౌనిక

అక్క ప్రాణాలతో ఉంటుందో లేదో అని భయపడుతున్నామని అన్నారు. తాము ఇంకా చిన్నపిల్లలమేనని...మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాన్న బతికి ఉన్నప్పటి నుంచి భూవివాదం ఉందని అన్నారు. తన నాన్న నంద్యాలకో, ఆళ్లగడ్డకో పరిమితమైన నేత కాదని..ఉమ్మడి ఏపీలో పేరు తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. ఎలాంటి వివాదమైనా కూర్చుని మాట్లాడుకుంటే తేలిపోతుందని..ఆమె స్పష్టం చేశారు. ఆస్తుల కోసం ఇంతగా వేధిస్తారా అని వాపోయారు. ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్‌ వచ్చినవారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఓటేయలేదా అని ప్రశ్నించారు

ఇదీ చూడండి.భూమా అఖిలప్రియను కస్టడీకి కోరుతూ బోయిన్​పల్లి పోలీసుల పిటిషన్

Last Updated : Jan 8, 2021, 7:41 PM IST

ABOUT THE AUTHOR

...view details