ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్.. పరారీలో ఆమె భర్త

bhuma-akhila-priya-on-police-custody
bhuma-akhila-priya-on-police-custody

By

Published : Jan 6, 2021, 12:08 PM IST

Updated : Jan 6, 2021, 4:33 PM IST

12:06 January 06

కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ అరెస్ట్

పోలీసుల అదుపులో అఖిలప్రియ

హైదరాబాద్​లోని బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు  అరెస్ట్ చేశారు. బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్‌కు తరలించారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ పరారీలో ఉన్నారు.

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ వ్యవహారంలో రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలోని ఆమె నివాసంలో అదుపులోకి తీసుకుని బేగంపేటలోని లెర్నింగ్ సెంటర్‌కు తరలించారు. అఖిలప్రియ భర్త భార్గవరామ్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆమె బంధువులను కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అఖిలప్రియకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ వ్యవహారంలో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసును ఛేదించామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. కిడ్నాప్‌ కేసు నిందితులందరినీ పట్టుకున్నామని తెలిపారు. 

మరింత సమాచారం...

ప్రవీణ్‌, సునీల్‌, నవీన్‌ కిడ్నాప్‌ కేసులో పోలీసులు మరింత సమాచారం రాబట్టారు.  ఈ ముగ్గురిని కిడ్నాపర్లు మొయినాబాద్‌ ఫాంహౌస్‌కు తీసుకెళ్లి... అక్కడ రెండు గంటలపాటు బంధించినట్లు తెలిసింది. దాదాపు 2 గంటల తర్వాత ముగ్గురిని ఓఆర్‌ఆర్‌పై వదిలివెళ్లినట్లు విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో ఫాంహౌస్ కాపలాదారుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ చేసిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు. మరోవైపు అఖిలప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 

ఇదీ చదవండి: 

ఎవరు కిడ్నాప్ చేశారో మాకు తెలుసు: ప్రతాప్​రావు‌

Last Updated : Jan 6, 2021, 4:33 PM IST

ABOUT THE AUTHOR

...view details