ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఒడిశాలో రోడ్డు ప్రమాదం... ఏపీ వాసి మృత్యువాత - accident in odisha news

ఒడిశాలోని భువనేశ్వర్​లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. పోలీసులు అతని వివరాలపై ఆరా తీస్తున్నారు.

Bhubaneswar Road Misha
Bhubaneswar Road Misha

By

Published : Oct 14, 2020, 11:30 PM IST

ఒడిశాలోని భువనేశ్వర్​లో రోడ్డు ప్రమాదం.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ లారీ డ్రైవర్ ను బలి తీసుకుంది. అక్కడి అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం... సరుకుల లోడుతో వెళ్తున్న ఓ లారీ... భారీ ఇనుప కడ్డీల లోడుతో ఉన్న మరో లారీని ఢీకొట్టింది. భువనేశ్వర్​లోని సీఆర్‌పీ స్క్వేర్ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన వాహనంలోకి ఇనుప కడ్డీలు చొచ్చుకుపోయాయి.

లారీ క్యాబిన్​ నుజ్జునుజ్జు అయ్యింది. అందులో చిక్కుకున్న డ్రైవర్​ను... 2 గంటల పాటు కష్టపడి రెస్క్యూ టీం బయటకు తీసింది. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ ను పట్టణంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మృతుడు ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఫరూక్​గా అక్కడి అధికారులు గుర్తించారు. అతనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details