ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కుక్కలకు కరోనా... ఆసుపత్రులకు జనాల పరుగులు? - బోయిగూడ పశువైద్యశాల

దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్​లో ఉన్న సింహాలకు కొవిడ్​ సోకడం వల్ల జంతు ప్రేమికులంతా భయపడుతున్నారు. తమ ఇళ్లల్లో పెంచుకుంటున్న శునకాలకు ఎక్కడా కరోనా సోకుతుందోనని నగరవాసులు పశువైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. పెంపుడు శునకాలకు పరీక్షలు చేపించేందుకు వచ్చిన వారితో సికింద్రాబాద్​ బోయిగూడ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది.

dogs effect in coona
dogs effect in coona

By

Published : May 6, 2021, 8:59 AM IST

కరోనా మహమ్మారి మూగజీవాలను కూడా వదట్లేదు అన్న విషయం తెలిశాక జంతు ప్రేమికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొందరు ఇంట్లో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ శునకాలకు ఎక్కడ కరోనా సోకుతుందేమోనని భయపడుతున్నారు. మరికొందరైతే... ఏకంగా కొవిడ్​ పరీక్షలు చేపించేందుకు పశువైద్యశాలలకు క్యూకట్టారు.

కుక్కలకు కరోనా... ఆసుపత్రులకు జనాల పరుగులు?

సికింద్రాబాద్ బోయిగూడలోని పశువుల ఆసుపత్రికి... జంతుప్రేమికులు పెద్దఎత్తున తరలివచ్చారు. తమ పెంపుడు జంతువులకు కొవిడ్​ పరీక్షలు చేయిస్తున్నారు. వైద్యశాల ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. మరోవైపు... శునకాలకు కొవిడ్ వస్తుందని ఇప్పటివరకూ.. ఎలాంటి ఆధారాలు లభించలేదని పశువైద్యశాల ఉన్నత వైద్యుడు నాగరాజు వెల్లడించారు. దీనిపై కంగారు పడాల్సిన అవసరం లేదని సూచించారు.

ఇదీ చూడండి: 'మరాఠా కోటా' తీర్పు.. రిజర్వేషన్లకు లక్ష్మణ రేఖ

ABOUT THE AUTHOR

...view details