బోయిన్పల్లి అపహరణ కేసులో 17 మంది నిందితుల బెయిల్ పిటిషన్లను సికింద్రాబాద్ న్యాయస్థానం తిరస్కరించింది. ప్రవీణ్‌రావు సోదరులను అపహరించిన కేసులో 17 మంది నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారి తరఫున న్యాయవాదులు సికింద్రాబాద్ న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని.. కేసులో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఇంకా పరారీలోనే ఉన్నారని పోలీసుల తరఫున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్‌ను తిరస్కరించింది.