ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని... భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా కిసాన్ సంఘ్ విజయవాడ ధర్నాచౌక్లో నిరసన చేపట్టింది. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు తమ భూములను త్యాగం చేశారని... ముందు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని... లేదంటే కిసాన్ సంఘ్ రైతులకు అండగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.
అమరావతి రైతులకు భారతీయ కిసాన్ సంఘ్ దన్ను..! - latest news on amaravathi farmers
రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని... లేదంటే రైతులకు అండగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ హెచ్చరించింది.
అమరావతి రైతులకు భారతీయ కిసాన్ సంఘ్ మద్దతు