ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bharath Biotech on Vaccination: ఇది ప్రతి భారతీయుడి విజయం: డాక్టర్​ కృష్ణా ఎల్లా - వ్యాక్సినేషన్​పై భారత్​ బయోటెక్​ ఎండీ స్పందన

కొవిడ్​ కట్టడిలో భాగంగా కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే వంద కోట్ల వ్యాక్సిన్​ డోసులు పంపిణీ చేసి.. భారత్ గొప్ప మైలురాయిని అందుకుందని బయోటెక్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణాఎల్లా (Bharath Biotech MD Krishna Ella on Vaccination) ప్రకటించారు (Bharath Biotech On Vaccination). ఇటువంటి చారిత్రాత్మక ఘట్టంలో భారత్ బయోటెక్ భాగస్వామ్యం కావటం గర్వంగా ఉందన్నారు.

ఇది ప్రతి భారతీయుడి విజయం: డాక్టర్​ కృష్ణా ఎల్లా
ఇది ప్రతి భారతీయుడి విజయం: డాక్టర్​ కృష్ణా ఎల్లా

By

Published : Oct 21, 2021, 5:35 PM IST

దేశంలో కొవిడ్​ కట్టడికి అనతి కాలంలోనే వందకోట్ల వ్యాక్సిన్ ​డోసులు పంపిణీ చేసిన భారత్ గొప్ప మైలురాయిని చేరిందని భారత్​ బయోటెక్​ ఎండీ డాక్టర్​ కృష్ణా ఎల్లా ప్రకటించారు (Bharath Biotech MD Krishna Ella on Vaccination).​ ఇది ప్రభుత్వం, వ్యాక్సిన్ తయారీదారులు, హెల్త్ కేర్ వర్కర్లు, వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి భారతీయుడు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు (Bharath Biotech On Vaccination).

అందరికీ కృతజ్ఞతలు

ఈ సందర్భంగా స్పందించిన భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్రా ఎల్లా (Bharath Biotech JMD Suchitra Ella on Vaccination)... భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ఉత్పత్తిలో తమకు సహకారం అందించిన ప్రధాన మంత్రి కార్యాలయం, హోం మంత్రిత్వ శాఖ, ఎన్​ఆర్​ఏ, ఐసీఎంఆర్, ఇండస్ట్రీ భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు.

చాలా గర్వంగా ఉంది..

ప్రాణాంతక కరోనా మహమ్మారిని నుంచి రక్షణ పొందేందుకు తీసుకుంటున్న కొవిడ్ వ్యాక్సిన్ల పంపిణీ వంద కోట్ల(India's 100 crore vaccination milestone)కు చేరడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Telangana Governor Tamilisai soundararajan) అన్నారు. భారతదేశ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఈ మైలురాయిని చేరుకోవడంలో కీలక పాత్ర వహించిన ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు. వందకోట్ల టీకాల పంపిణీ పూర్తైన సందర్భంగా హైదరాబాద్ సనత్​నగర్​లోని ఈఎస్​ఐ ఆస్పత్రికి గవర్నర్ వెళ్లారు. కొవిడ్ టీకా పంపిణీలో ప్రధాన పాత్ర వహించిన ఈఎస్​ఐ వైద్యులను తమిళిసై(Telangana Governor Tamilisai soundararajan) సన్మానించారు.

ఇదీ చూడండి:Telangana Governor Tamilisai : ప్రపంచ దేశాలకు మన వ్యాక్సిన్లు అందించే స్థాయికి ఎదిగాం

చైనా తర్వాత..

కరోనా మహమ్మారి కోరలు విరిచేందుకు భారత్ చేపట్టిన ‘టీకా మహోద్యమం’ నేడు కీలక ఘట్టానికి చేరుకుంది. బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో ‘శతకోటి’ ప్రయాణాన్ని నిర్విగ్నంగా పూర్తిచేసింది. టీకా పంపిణీలో భారత్‌ నేడు 100కోట్ల మైలురాయిని అధిగమించింది. చైనా తర్వాత వంద కోట్ల డోసులు అందించిన రెండో దేశంగా భారత్‌ కీర్తి గడించింది.

దేశంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ఈ ఏడాది జనవరి 16న టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి దశలో భాగంగా కరోనా పోరులో ముందున్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులకు టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి, మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించారు.

ఇదీ చూడండి:

వ్యాక్సినేషన్ @100 కోట్లు- ప్రత్యేక గీతం, ఏవీ విడుదల

ABOUT THE AUTHOR

...view details