ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bharat Biotech CMD: సింపుల్ థింకింగ్ అలవాటుతోనే సమస్యలకు పరిష్కారం: కృష్ణా ఎల్లా - ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు

తరగతి గదుల్లో కన్నా.. మానవ మస్తిష్కంలోనే ఆవిష్కరణలు ఉద్భవిస్తాయని.. ఊహా శక్తే వాటికి ప్రాణం పోస్తుందని భారత్ బయెటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా వివరించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్​మెంట్ 46వ ఫౌండేషన్ వేడుకల సందర్భంగా నిర్వహించిన లెక్చర్​లో కృష్ణా ఎల్లా కీలకపోన్యాసం చేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో భాగంగా.. "ఇన్నోవేషన్స్ ఫర్ ట్రాన్స్​మిషన్" అనే అంశంపై డాక్టర్ కృష్ణా ఎల్లా వర్చువల్​గా మాట్లాడారు. జనరిక్ వ్యాక్సిన్లు అభివృద్ధి చేసే భారత్ నేడు గ్లోబల్ వ్యాక్సిన్ తయారీదారుగా ఎదిగిందని తెలిపారు.

Bharat Biotech MD Krishna Ella
కృష్ణా ఎల్లా

By

Published : Sep 1, 2021, 7:27 PM IST

రియల్ ఎస్టేట్ పేరుతో అడవులను నాశనం చేసుకుంటున్నామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా అభిప్రాయపడ్డారు. డీఫారెస్టేషన్ వల్ల జనావాసాలకు జంతువులే కాదు... అవి మోసుకొచ్చే సాంక్రమిక వ్యాధులతో సైతం మానవాళి పోరాడాల్సి ఉంటుందని కృష్ణా ఎల్లా హెచ్చరించారు. సూక్ష్మజీవులు మనకన్నా తెలివైనవని.. వాతావరణ మార్పుల కారణంగా మరిన్ని వైరస్​లు మానవుడిపై దాడి చేసే అవకాశాలున్నాయన్నారు. 1996లో భారత్​కు తిరిగొచ్చాక ఇక్కడి నీటి సమస్యలు, దోమల బెడద తనను ఆలోచనలో పడేశాయని.. ఈ సమస్యలే తన స్టార్టప్​నకు ఆయువు పోశాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యలే ఇన్నోవేటివ్ ఐడియాలుగా ఎంచుకొని.. రోటావాక్, టైఫాయిడ్ కాంజుగేట్ వ్యాక్సిన్​లతో పాటు, చికన్​గున్యా, జికా వైరస్​లకు తమ కంపెనీ వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు కృష్ణా ఎల్లా తెలిపారు. ఇండియన్ కంపెనీ నుంచి గ్లోబల్ కంపెనీగా భారత్ బయోటెక్ ఎదిగిందని తెలిపారు.

"ఆలోచనే ఆవిష్కరణకు మూలమని.. డిగ్రీలు, నైపుణ్యాలతో పాటు ఊహే ఇన్నోవేషన్​కు ప్రాణం పోస్తుంది. భారతీయ విద్యార్థులు డిగ్రీలు, నైపుణ్యాలతో పాటు థాట్ ప్రాసెస్​ను పెంపొందించుకోవాలి. సంక్లిష్ట ఆలోచనలు వదిలి.. సింపుల్ థింకింగ్ అలవాటు చేసుకోవటం ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. భారతీయ సాంప్రదాయ ఉత్పత్తులకు వాల్యు యాడ్ చేసి ఎగుమతి చేయాల్సిన అవసరముంది. తద్వారా జీడీపీ వృద్ధి చెందుతుంది. రైతులకు ఉత్పత్తిలో కన్నా.. మార్కెటింగ్​లో మద్దతు అవసరం. జన్యు మార్పిడి పంటలు మనం వదులుకొని రెవెన్యూ కోల్పోతున్నాం. మామిడి పళ్ల ఎగుమతుల కన్నా.. దానిమ్మ పండ్ల ఎగుముతులపై దేశం దృష్టి పెడితే మరింత గ్లోబల్​గా విస్తృతంగా మార్కెట్ చేయవచ్చు." - కృష్ణా ఎల్లా, భారత్ బయోటెక్ సీఎండీ

ఇప్పటివరకూ దక్షిణ, పశ్చిమ భాగానికే పరిమితమైన బయెటెక్ క్లస్టర్​ను తూర్పు భారత్ వైపు విస్తరించేందుకు 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒడిశాలోని భువనేశ్వర్​లో నూతన బయోటెక్ క్లస్టర్ నిర్మిస్తున్నట్లు ఈ సందర్భంగా కృష్ణా ఎల్లా తెలిపారు. ప్రతి దేశం వారి వ్యాక్సిన్​ను మార్కెట్ చేసుకోవాలనే స్ట్రాటజీతో ముందుకెళ్తుందని.. ఇదే భారత్ బయోటెక్​కు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్​పై ఆంక్షల విధింపునకు కారణమని కృష్ణా ఎల్లా చెప్పుకొచ్చారు. ఈ గ్లోబల్ పాలిటిక్స్ ఎక్కువ రోజులు పనిచేయవని.. రాబోయే రెండు, మూడేళ్లలో కొవాగ్జిన్ గ్రహీతలకు ఇంటర్నేషనల్ ట్రావెలింగ్​కు అభ్యంతరాలు చెరిపేసేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు కృష్ణా ఎల్లా ప్రకటించారు.

ఇదీ చూడండి:

Power Cut: రూ.6.5 కోట్ల విద్యుత్ బకాయి..మున్సిపల్ కార్యాలయానికి పవర్ కట్

ABOUT THE AUTHOR

...view details