ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నిరంతరం పనిచేస్తున్నాం.. నిందలు సరికాదు: సుచిత్ర ఎల్లా - భారత్ బయోటెక్ తాజా వార్తలు

కరోనా కష్టకాలంలో ప్రజలకు వాక్సిన్ అందిచేందుకు నిరంతరం పనిచేస్తున్నామని భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. కొన్ని రాష్ట్రాలు కావాలనే తమపై దురుద్దేశాలు ఆపాదించేలా వ్యాఖ్యలు చేయడం ఆవేదన కలిగిస్తుందని తెలిపింది. వాక్సిన్ విషయంలో అన్ని రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇస్తున్నామన్నామని ఆమె స్పష్టం చేశారు.

suchitra ella
సుచిత్ర ఎల్లా

By

Published : May 12, 2021, 3:42 PM IST

కరోనా విపత్కాలంలో ప్రజలుకు వాక్సిన్ అందించేందుకు తమ సంస్థ నిరంతరం పనిచేస్తోందని.. భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా తెలిపారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకూ ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. తమకు దురుద్దేశాలు ఆపాదించేలా కొన్ని రాష్ట్రాలు వ్యాఖ్యలు చేయడం ఆవేదన కలిగిస్తోందని ఆమె ట్వీట్ చేశారు. ఇలాంటి వాఖ్యలు వాక్సిన్ తయారీలో నిమగ్నమైన తమ సిబ్బందిని బాధకు గురిచేస్తున్నాయన్నారు. మే 10న 18 రాష్ట్రాలకు వాక్సిన్ సరఫరా చేసినట్లు ట్వీట్​లో పేర్కొన్నారు.

సుచిత్ర ఎల్లా రీ ట్వీట్

కరోనా కారణంగా 50మంది ఉద్యోగులు విధులకు హాజరు కావడంలేదని.. అయినప్పటికీ వాక్సిన్​ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని ఆమె చెప్పారు. మే 1 నుంచి రాష్ట్రాలకు వాక్సిన్​ అందించేందుకు నిరంతరంగా పనిచేస్తున్నామని భారత్ బయోటెక్ సంస్థ మరో ట్వీట్ చేసింది.

ABOUT THE AUTHOR

...view details