ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫోర్త్​ వేవ్​ వచ్చినా భారత్​కు తట్టుకునే సామర్థ్యం ఉంది: కృష్ణ ఎల్ల - bharat biotech

Bharat Biotech CMD on Fourth Wave: కొవిడ్ ఫోర్త్ వేవ్ వచ్చినా.. భారత్​కు తట్టుకునే సామర్థ్యం ఉందని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. భవిష్యత్​లో లాక్ డౌన్ ఉండే అవకాశం లేదన్న ఆయన.. మూడు డోసులు వేయించుకుంటేనే ఉపయోగం ఉంటుందన్నారు.

Bharat Biotech CMD on Fourth Wave
భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల

By

Published : Mar 19, 2022, 9:01 PM IST

Bharat Biotech CMD on Fourth Wave: భారత్​లో కొవిడ్​ నాలుగో వేవ్​పై భారత్​ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్ల స్పందించారు. దేశంలో నాలుగో వేవ్​ వస్తుందని.. వచ్చినా భారత్‌కు తట్టుకునే సామర్థ్యం ఉందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో లాక్‌డౌన్‌ ఉండే అవకాశం లేదన్న ఆయన.. మూడు డోసులు వేయించుకుంటేనే ఉపయోగం ఉంటుందన్నారు.

ఫోర్త్​ వేవ్​ వచ్చినా భారత్​కు తట్టుకునే సామర్థ్యం ఉంది: కృష్ణ ఎల్ల

'ది ఎరాడికేషన్‌ ఇంబ్రోగ్లియో పోలియో-దిమలాడీ, ఇట్స్‌ రెమెడీ' పుస్తకాన్ని భారత వైరాలజీ పితామహుడు డాక్టర్‌ జాకాబ్‌ జాన్‌ దిల్లీలో ఆవిష్కరించారు. జాకాబ్‌ జాన్‌ రాసిన ప్రత్యేక పుస్తకాన్ని భారత్‌ బయోటెక్‌ ముద్రించింది. వైరాలజీ, పోలియో నిర్మూలన కోసం టీకాల పరిశోధన అంశాలపై పుస్తకంలో వివరించారు. టీకాల పరిశోధన, ప్రస్తుత కరోనా పరిస్థితులపైనా చర్చించారు.

భయపడాల్సిన అవసరం లేదు..

భారతదేశం గొప్పస్థితిలో ఉంది. దేశంలో ఫోర్త్​ వేవ్​ వస్తుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. వచ్చినా తట్టుకునే సామర్థ్యం భారత్​కు ఉంది. ప్రతి ఒక్కరు మూడు డోసులు వేయించుకుంటేనే ఉపయోగం. -కృష్ణ ఎల్ల, భారత్​ బయోటెక్​ సీఎండీ

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details