ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా పోరాటం కరోనాను జయించడమే: భారత్​ బయోటెక్​ - India s first indigenous COVID vaccine

్
bharat-bio-tech-on-corona-vaccine

By

Published : Aug 4, 2020, 2:18 PM IST

Updated : Aug 4, 2020, 4:48 PM IST

14:13 August 04

తక్కువ ధరలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకువస్తాం: భారత్​ బయోటెక్​

కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతో నైపుణ్యం సాధించామని భారత్ బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్లా అన్నారు. వాటర్ బాటిల్ ధర కంటే తక్కువ ధరలోనే వ్యాక్సిన్ తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైరస్ కొత్తది కావడం వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌పై జినోమ్‌ వ్యాలీలో జరిగిన చర్చ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... అమెరికాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంతో సహకరిస్తున్నాయని వెల్లడించారు. మేం మార్కెట్‌లో పోటీదారులం కావొచ్చని... కానీ మా అందరి పోరాటం కరోనాను జయించడంపైనే అని వ్యాఖ్యానించారు.

భారత వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 70 శాతం వాటా 3 హైదరాబాద్‌ కంపెనీలదేనన్న ఆయన... ప్రపంచంలో ఏ వ్యాక్సిన్ కంపెనీ కంటే కూడా హైదరాబాద్‌ కంపెనీలు తక్కువ కాదని అన్నారు.  

వ్యాక్సిన్ల అభివృద్ధి కంపెనీలతో కేంద్రం సంప్రదింపులు జరపాలి. వేగంగా వ్యాక్సిన్ తేవడానికి ఎవరి అవసరాలు ఏంటో తెలుసుకోవాలి. అందుబాటు ధరలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకొస్తాం. ప్రపంచం మొత్తానికి ఒకే నాణ్యతతో కూడిన వ్యాక్సిన్‌ను అందిస్తాం. - భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్లా

వ్యాక్సిన్‌ ధర అందుబాటులో ఉండాలి: డాక్టర్‌ ఆనంద్‌

ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్‌ ఎండీ డాక్టర్‌ ఆనంద్‌ మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌ అధిక ధరలో ఉంటే చాలా మందికి అందుబాటులో లేకుండా పోతుందన్నారు. ‘

‘ఒక్కో డోసు ధర రూ.1000 అయినా భారత్‌ లాంటి దేశాలకు అది చాలా భారం. మేము తయారు చేస్తున్న వ్యాక్సిన్‌కు కొంత సమయం పట్టొచ్చు..కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది. దేశంలో ఏడు సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిలో కీలకంగా ఉన్నాయి. ఈ ఏడు సంస్థలను కలిపి ఒక్కసారి కూడా సమావేశం ఏర్పాటు చేయలేదు. డీబీటీ, సీఎస్‌ఐఆర్‌ మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. -డాక్టర్ అనంద్‌, ఇండియన్ ఇమ్యునోలాజికల్ లిమిటెడ్  

నిధుల లభ్యత కీలకం: మహిమ దాట్ల

బయోలాజికల్‌ ఈ లిమిటెడ్‌ ఎండీ మహిమా దాట్ల మాట్లాడుతూ.. ప్రస్తుతం కరోనా స్పెక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుని అనేక వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని తెలిపారు. ఏ వ్యాక్సిన్‌ కూడా భద్రతను పణంగా పెట్టి ప్రయోగాలు చేయదన్నారు. వ్యాక్సిన్ల అన్నింటి లక్ష్యం కరోనా నుంచి రక్షణ కవచం అందించడమేనని స్పష్టం చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సహజంగా కొన్ని ప్రతిజనకాలు ఏర్పడతాయి... అదే శక్తిని వ్యాక్సిన్లు ఔషధ రూపంలో అందిస్తాయని వివరించారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి విధానాన్ని బట్టి వాటి సామర్థ్యాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి అని తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన నెల వ్యవధిలోనే భారీ స్థాయి ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. నెల వ్యవధిలో 8 నుంచి 10కోట్ల డోసులు అందుబాటులోకి తీసుకు రాగలమని స్పష్టం చేశారు.  

ఇదీ చదవండి:

2019 సివిల్​ సర్వీసెస్​ ఫలితాలు విడుదల

Last Updated : Aug 4, 2020, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details