ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారత్ బంద్: రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్ ప్రభావం

రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్ ప్రభావం
రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్ ప్రభావం

By

Published : Mar 26, 2021, 7:02 AM IST

Updated : Mar 26, 2021, 12:18 PM IST

12:17 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • విశాఖలో ఉక్కు నిర్వాసితుల శిబిరం వద్ద సురేష్‌బాబుకు సత్కారం
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ సురేష్‌బాబు 470 కి.మీ. పాదయాత్ర
  • గుంటూరు నుంచి విశాఖ వరకు పాదయాత్ర చేసిన తోట సురేష్‌బాబు

11:39 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెదేపా, వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌
  • నూతన సాగు చట్టాలను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు
  • విద్యాసంస్థలు, బ్యాంకులను మూసివేయిస్తున్న నిరసనకారులు

10:50 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • గుంటూరులో తెదేపా కార్యాలయం నుంచి శంకర్ విలాస్ కూడలి వరకు ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొన్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, తెదేపా శ్రేణులు

10:35 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • గుంటూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
  • హిందూ కళాశాల కూడలి వద్ద కాంగ్రెస్‌ మానవహారం
  • హోదా, విశాఖ ఉక్కు కోసం ఎంపీలు రాజీనామా చేసి పోరాడాలని డిమాండ్‌

10:22 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • శ్రీకాకుళంలో ప్రధాన తపాలా కార్యాలయం వద్ద నిరసన
  • తెదేపా, వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా
  • రామలక్ష్మణ కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో  ఆందోళన

10:07 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • చిత్తూరుజిల్లావ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
  • భక్తులను దృష్టిలో ఉంచుకుని తిరుమలకు మాత్రమే బస్సు సర్వీసులు
  • తిరుపతిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రజాసంఘాలు, వామపక్షాల నిరసన
  • విశాఖ ఉక్కును కాపాడాలి, నూతన సాగు చట్టాలు రద్దు చేయాలని నినాదాలు
  • బంద్‌లో పాల్గొన్న తెదేపా నేతలు బుద్దా వెంకన్న, పనబాక లక్ష్మి, సుగుణమ్మ, నరసింహ యాదవ్

09:28 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • పశ్చిమగోదావరి జిల్లా  దెందులూరు మండలం సత్యనారాయణపురంలో రాస్తారోకో
  • 16వ నెంబరు జాతీయ రహదారిపై రైతుల బైఠాయింపు
  • రైతు సంఘాల రాస్తారోకోతో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

09:09 March 26

పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతున్న బంద్​..

  • ప.గో.: దెందులూరు మం. సత్యనారాయణపురంలో రాస్తారోకో
  • 16వ నెంబరు జాతీయ రహదారిపై రైతు సంఘాల రాస్తారోకో
  • రైతు సంఘాల రాస్తారోకోతో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

08:41 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • విశాఖలో 43వ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు
  • కూర్మన్నపాలెం కూడలి వద్ద దీక్షలు
  • విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నాలు
  • ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

08:36 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • ప్రకాశంజిల్లా చీరాలలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు నిలిపివేత
  • బంద్‌ కారణంగా  వస్త్ర, వ్యాపార సంస్థల దుకాణాలు మూసివేత
  • చీరాల ముఖ్య కూడళ్లలో పోలీసుల బందోబస్తు

08:18 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • నెల్లూరు జిల్లా వెంకటగిరిలో డిపోకే పరిమితమైన 115 బస్సులు

08:07 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • తూర్పుగోదావరి జిల్లా  కాకినాడ, రాజమహేంద్రవరం సహా 9 డిపోల్లో నిలిచిన బస్సులు
  • కాకినాడలో బ్యాంకులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు బంద్
  • జిల్లాలో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం

08:01 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • విశాఖజిల్లా  కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు నిర్వాసితుల ఆందోళన
  • బంద్‌లో భాగంగా కూర్మన్నపాలెం వద్ద రహదారి దిగ్బంధం
  • ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉక్కు నిర్వాసితుల నిరసన

07:52 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • కృష్ణా జిల్లాలో డిపోల్లోనే బస్సులు
  • గన్నవరంలో మూతబడిన వ్యాపార దుకాణాలు, విద్యాసంస్థలు
  • నూతన సాగు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన

07:17 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వామపక్షాల ధర్నా
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ నినాదాలు
  • ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించిన యాజమాన్యాలు

07:05 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • బంద్‌కు మద్దతు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • సాగు చట్టాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్‌
  • విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీలో బంద్‌
  • భారత్‌ బంద్‌కు రాష్ట్రంలోని పలు సంఘాల మద్దతు
  • మద్దతు తెలిపిన ఏపీ అమరావతి ఐకాస,  ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం
  • బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు తెదేపా పిలుపు

07:04 March 26

కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • పశ్చిమగోదావరి జిల్లాలో  7 డిపోల పరిధిలో నిలిచిన బస్సులు
  • భారత్ బంద్ సందర్భంగా ఎక్కడికక్కడ ఆగిన బస్సులు
  • జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద వామపక్షాల  నిరసన

07:03 March 26

భారత్ బంద్: రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద వామపక్షాల ఆందోళన
  • బంద్‌ సందర్భంగా డిపోల నుంచి బయటకు రాని బస్సులు

07:00 March 26

భారత్ బంద్: రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్ ప్రభావం

  • కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న భారత్ బంద్
  • ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాల ఆందోళన
  • జిల్లాలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

06:21 March 26

bharat band

  • విశాఖ జిల్లా మద్దిలపాలెం బస్టాండ్ వద్ద బంద్ నిర్వహిస్తున్న వామపక్షాలు
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాల నినాదాలు
  • బంద్‌లో పాల్గొన్న సీపీఎం కార్పొరేటర్ గంగరావు, సీపీఎం నాయకులు
Last Updated : Mar 26, 2021, 12:18 PM IST

ABOUT THE AUTHOR

...view details