ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చరవాణి యాప్​తో భక్తులకు రామయ్య తలంబ్రాలు

తెలంగాణలోని భద్రాచలంలో కొలువైన రామయ్య కల్యాణం ప్రత్యక్షంగా వీక్షించలేని భక్తులకు భద్రాచలం దేవస్థానం కొత్త ఏర్పాటు చేసింది. రామయ్య కల్యాణ తలంబ్రాలను నేరుగా భక్తులకు చేరేలా కార్యాచరణ రూపొందించింది. అందుకోసం చరవాణిలో టీ యాప్​, పోలియో యాప్​ డౌన్​లోడ్​ చేసుకోవాలని సూచించారు ఆలయ అధికారులు.

By

Published : Apr 5, 2020, 4:15 PM IST

bhadradri-ramayya-marriage-talambras-directly-to-the-devotees
చరవాణి యాప్​తో భక్తులకు రామయ్య తలంబ్రాలు

చరవాణి యాప్​తో భక్తులకు రామయ్య తలంబ్రాలు

తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాలు నేరుగా భక్తులకు చేరేలా దేవస్థానం ఏర్పాటు చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా సీతారాముల కల్యాణాన్ని భక్తులు లేకుండా వేదపండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఘనంగా నిర్వహించారు. అయితే ఈ వేడుకకు హాజరుకాని భక్తులకు ఈ తలంబ్రాలు నేరుగా ఇంటివద్దకే పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

చరవాణిలో గూగుల్ ప్లే స్టోర్​ నుంచి టీ యాప్, పోలియో యాప్​ను డౌన్​లోడ్​ చేసుకొని.. అందులో పూర్తి వివరాలు నమోదు చేయాలని ఆలయ అధికారులు తెలిపారు. నమోదు అనంతరం తలంబ్రాలు పొందవచ్చన్నారు. రెండు ముత్యాలు గల ఒక తలంబ్రాల ప్యాకెట్ రూ.20కు అందిస్తున్నామని.. ఒక్కొక్కరికి రెండు ప్యాకెట్లు మాత్రమే పంపిస్తామని పేర్కొన్నారు. పోస్టల్ ఛార్జీలు అదనంగా ఉంటాయని తెలిపారు.

ఇదీ చదవండి.

లాక్​డౌన్​ను ప్రజలు పాటించాలి: కోనేరు హంపి

ABOUT THE AUTHOR

...view details