ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏడో రోజుకు.. భద్రాచలం వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు - వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజు స్వామి వారు నిజరూప అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు, వజ్రాభరణాలతో లక్ష్మణ సమేత సీతారాములను ఆలయ అర్చకులు అందంగా అలంకరించారు.

bhadrachalam
భద్రాచలం

By

Published : Dec 21, 2020, 5:19 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఏడవ రోజు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు శ్రీరామచంద్రుడు తన నిజ రూపమైన శ్రీరామ అవతారంలో దర్శనమిచ్చారు.

భక్త రామదాసు చేయించిన బంగారు ఆభరణాలు, వజ్రాలు పొదిగిన మణి మాణిక్యాలతో లక్ష్మణ సమేత సీతారాములను ఆలయ అర్చకులు అందంగా అలంకరించారు. లోకకంటకులైన రావణుడు, కుంభకర్ణుడు అనే రాక్షసులను సంహరించడానికి దశరథుని కుమారుడిగా మహావిష్ణువు.. శ్రీరామ అవతారం ఎత్తినట్లు ఆలయ వేద పండితులు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details