సూర్యగ్రహణం సందర్భంగా తెలంగాణలోని భద్రాద్రి రామయ్య ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. ఉదయం 10.20 గంటల నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు రామయ్య సన్నిధి ద్వార బంధనంలో ఉండనుంది. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను మూసివేశారు. చూడామణి నామక సూర్య గ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలు మూసి వేసినట్లు ఆలయ స్థానాచార్యులు స్థలశాయి సాయి తెలిపారు. సాయంత్రం గోదావరి జలాలతో సంప్రోక్షణ నిర్వహించి...స్వామివారికి అభిషేకం నిర్వహిస్తామని అర్చకులు స్పష్టం చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు.
ద్వార బంధనంలో భద్రాద్రి రామయ్య సన్నిధి - భద్రాద్రి రామయ్య గుడి మూసివేత
సూర్యగ్రహణం సందర్భంగా తెలంగాణలోని భద్రాద్రి రామయ్య ఆలయాన్ని అర్చకులు ద్వార బంధనం చేశారు. సాయంత్రం సంప్రోక్షణ అనంతరం ఆలయాన్ని తిరిగి తెరవనున్నారు.
ద్వార బంధనంలో భద్రాద్రి రామయ్య సన్నిధి