ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bhadrachalam Temple: భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో శ్రీరామ నవమి టికెట్లు - భద్రాచలం సీతారాముల కల్యాణ వేడుక

Bhadrachalam Temple: తెలంగాణలోని భద్రాచలం సీతారాముల కల్యాణ వేడుక టికెట్లను నేటి నుంచి ఆన్​లైన్​లో పొందవచ్చని ఆలయ ఈవో శివాజీ వెల్లడించారు. ఏప్రిల్​ 10న కల్యాణం, 11న రామయ్య పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వేడుకలకు భక్తులను అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు.

Bhadrachalam Temple
Bhadrachalam Temple

By

Published : Mar 3, 2022, 10:10 AM IST

Bhadrachalam Temple: రాములోరి భక్తులకు భద్రాచలం దేవస్థానం శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా సీతారాముల కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించిన అధికారులు.. ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలోని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ 2 నుంచి 16 వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ నెల 10న జరిగే కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు సెక్టార్లుగా విభజించి నిర్దేశించిన టికెట్‌లను గురువారం నుంచి ఆన్‌లైన్‌లో పొందవచ్చని ఈవో శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు.

రూ.7,500, రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150 విలువైన టికెట్‌లను ‌www.bhadrachalamonline.com అనే వెబ్‌సైట్‌ నుంచి తీసుకోవచ్చని వివరించారు. రూ.7,500 టికెట్‌కు మాత్రం కల్యాణ ఉభయ దాతలకు అనుమతి ఉంటుందని దీనిని నేరుగా ఆలయ కార్యాలయంలో కూడా తీసుకోవచ్చని వెల్లడించారు. ఏప్రిల్‌ 11న జరిగే పట్టాభిషేకం పర్వానికి సంబంధించి సెక్టార్‌ ప్రవేశానికి రూ.1,000 టికెట్‌ను ఆన్‌లైన్‌లో తీసుకోవాలని తెలిపారు.

ఇదీ చదవండి:

144 Section at AU: ఆంధ్ర వర్సిటీ, పరిసరాల్లో 144 సెక్షన్.. నాయకుల గృహనిర్భంధం

ABOUT THE AUTHOR

...view details