రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ వివాదాస్పదమవుతోంది. చిత్ర టైటిల్ వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు హైదరాబాద్లోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సంచలనాల పేరుతో ఆదాయం పెంచుకోవటానికే ఇలాంటి సినిమాలు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ తరహా సినిమాలతో సమాజంలో అసమానతలు తీవ్రతరం అవుతాయని అభిప్రాయపడ్డారు. వెంటనే సినిమా పేరు మార్చాలని కోరారు. కథను క్షుణ్ణంగా పరిశీలించే విడుదలకు అనుమతి ఇవ్వాలని..లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
వర్మ సినిమాపై సెన్సార్ బోర్డుకి బీజేవైఎం ఫిర్యాదు - news about kamma rajyamlo kadapa readllu movie
రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం పేరు మార్చాలని రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు హైదరాబాద్లోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
BGYM complant to sensor board about Varma's film title
ఇదీ చదవండి : కేసీఆర్ వ్యాఖ్యలతో కసి పెరిగింది: మంత్రి పేర్ని నాని