తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండ గ్రామంలో మరణించిన ఓ వ్యక్తికి ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికి.. తేనెటీగలు ఒక్కసారిగా మృతుడి బంధువుల మీద దాడి చేశాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో.. కుటుంబీకులు మృతదేహాన్ని వదిలి పరుగులు తీశారు. తేనెటీగలు వెళ్లిపోయిన తర్వాత తిరిగి అంత్యక్రియలు నిర్వహించారు.
అంతిమయాత్రలో తేనెటీగల దాడి..మృతదేహాన్ని వదిలి వెళ్లిన బంధువులు - పెద్దపల్లి జిల్లా వార్తలు
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిధిలో మరణించిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు చేస్తుండగా అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేశాయి. వాటి భయంతో బంధువులు మృతదేహాన్ని వదిలి పరుగులు తీశారు.
అంతిమ యాత్రలో తేనెటీగల దాడి