రాజధాని అంశంపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సీఎంకు నివేదిక సమర్పించింది. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీజీ అధ్యయనం చేసింది. రాజధానిపై ఇప్పటికే జీఎన్‌రావు కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు బీసీజీ నివేదికపై అధ్యయనానికి ఈనెల 6న ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తొలిసారి భేటీ కానుంది. ఈనెల 8న జరిగే మంత్రివర్గ సమావేశంలోనూ బీసీజీ నివేదికపై ప్రభుత్వం చర్చించే అవకాశముంది. ఈ రెండు నివేదికలపై అధ్యయనం తర్వాత 3వారాల్లోగా హైపవర్ కమిటీ నివేదికను అందజేయనుంది.
రాజధానిపై సీఎంకు అందిన బోస్టన్ నివేదిక - latest new son amaravathi
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రతినిధులు సీఎంకు నివేదిక సమర్పించారు. రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీజీ అధ్యయనం చేసింది. ఈనెల 8న జరిగే కేబినెట్ సమావేశంలోనూ బీసీజీ నివేదికపై ప్రభుత్వం చర్చించే అవకాశముంది.
బోస్టన్ నివేదిక
Last Updated : Jan 3, 2020, 6:08 PM IST