ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక' - BC welfare Minister Sankara Narayana Review with officials

సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ అధికారులకు సూచించారు. నూతన మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు.

అర్హులకే పథకాలు అందాలి: మంత్రి శంకర నారాయణ

By

Published : Aug 20, 2019, 6:11 PM IST

అర్హులకే పథకాలు అందాలి: మంత్రి శంకర నారాయణ

అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా కొత్త యూనిట్ల గుర్తింపునకు చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్ధిదారుల స్థితిగతులు పరిగణలోకి తీసుకుని యూనిట్లు మంజూరు చేయాలని పేర్కొన్నారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేశారు. ప్రతి నెల తొలి వారంలో జిల్లాస్థాయిలో ఈడీ సమావేశం జరపాలని ఆదేశించారు. వ్వవసాయ, రవాణా, కంప్యూటర్ విడి పరికరాల విక్రయంపై దృష్టి సారించాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details