బీసీ కులాల సంక్షేమ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్ల జీతాలు, అలవెన్సులను ప్రభుత్వం ఖరారు చేసింది. కార్పొరేషన్ ఛైర్మన్‌కు రూ.56 వేలు ఇవ్వాలని నిర్ణయించగా.. డైరెక్టర్‌కు రూ. 12వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా ఒక్కో బీసీ కులం కార్పొరేషన్‌కు రూ. 2.12 లక్షలు కేటాయించనుంది. ఈ మొత్తంతోనే కార్యాలయం వసతి, ఇతర ఖర్చులు భరించాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ఈనెల 1 నుంచి ఉత్తర్వులు అమలవుతాయని పేర్కొంది.
ప్రాఫిట్ మేకింగ్ కార్పొరేషన్ల జీతాలు ఖరారు...