ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయవాదులకు ఆర్థికసాయం - ఏపీ లాక్​ డౌన్ ఎఫెక్ట్స్

లాక్​డౌన్​ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న న్యాయవాదులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఏపీ బార్​ కౌన్సిల్ ముందుకొచ్చింది. గతంలో ఇచ్చిన మాదిరిగానే 2005 నుంచి 2009లోపు న్యాయవాదులుగా పేరు నమోదుచేసుకున్న వారికి ఆర్థికసాయం చేస్తామని కౌన్సిల్ ఛైర్మన్ తెలిపారు.

bar council decides to economic support poor lawyers
న్యాయవాదులకు ఆర్థికసాయం.. బార్ కౌన్సిల్ నిర్ణయం

By

Published : Apr 24, 2020, 6:02 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న న్యాయవాదులకు ఆర్థిక సహాయం చేయాలని ఏపీ బార్ కౌన్సిల్ నిర్ణయించింది. 2005 నుంచి 2009 లోపు న్యాయవాదులుగా పేరు నమోదు చేసుకున్న వారిలో రోజువారి నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతున్నవారికి రెండో దశలో ఆర్థిక సాయం చేయాలని ఏపీ న్యాయవాదుల మండలి నిర్ణయించింది. అర్హులైన న్యాయవాదులు ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీలోపు ఆన్​లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బార్‌ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు తెలిపారు. మొదటి విడతలో ఆర్థిక సాయంగా 2010 నుండి ఫిబ్రవరి 2020 వరకు న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న 2743 మందికి రూ.3,500 చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు. లాక్​డౌన్ కాలంలో న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు ఇంటి వద్దనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details