ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయవాదుల కుటుంబాలకు 'మ్యాచింగ్ గ్రాంట్' నిధులు.. బార్ కౌన్సిల్ హర్షం - మరణించిన న్యాయవాదులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌

వివధ కారణాలతో మృతి చెందిన న్యాయవాదుల విషయంలో ప్రభుత్వం స్పందించింది. వారి కుటుంబాలకు సాయం చేసేందుకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద ప్రభుత్వం రూ. 1.76 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ బార్ కౌన్సిల్ తరఫున చైర్మన్ గంటా రామారావు.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Bar Council Chairmen
Bar Council Chairmen

By

Published : Jun 19, 2021, 11:55 AM IST

వివిధ కారణాలతో మృతిచెందిన 34 మంది న్యాయవాదుల కుటుంబాలకు ప్రభుత్వం వంతుగా మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద నిధులు విడుదల చేసిన సీఎం జగన్​కు అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌కు ఏపీ బార్‌ కౌన్సిల్‌ తరఫున ఛైర్మన్‌ గంటా రామారావు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు చెల్లించేందుకు రూ.1.36 కోట్లు విడుదల చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు.

చనిపోయిన మిగిలిన న్యాయవాదుల విషయంలోనూ స్పందించి.. వారి కుటుంబ సభ్యులకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ నుంచి ఇప్పటికే ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షలు చెల్లించామన్నారు. బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details