ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా కె. జానకిరామిరెడ్డి గెలుపొందారు. జానకిరామిరెడ్డి మొత్తం 821 ఓట్లు పొందారు. అధ్యక్షుడి పదవికి బరిలో ఉన్న కె. సత్యనారాయణ మూర్తికి 366 ఓట్లు రాగా.. 923 ఓట్లతో ఉపాధ్యక్షుడిగా పి. నరసింహమూర్తి గెలుపొందారు.
ప్రధాన కార్యదర్శిగా కోనపల్లి నర్సిరెడ్డి ఇప్పటికే ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. సంయుక్త కార్యదర్శిగా దూదేకుల ఖాసిం సాహెడ్ గెలుపొందారు. గ్రంథాలయ కార్యదర్శిగా మెట్టా సప్తగిరి, కోశాధికారిగా ఏవీఎన్‌హెచ్ శాస్త్రి గెలిచారు. క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా నందు సతీశ్, మహిళా ప్రతినిధిగా సుఖవేణి, కార్యనిర్వహణ సభ్యులుగా బి. పరమేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ కమిటీ మహిళ సభ్యులుగా భారతలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈసీ సభ్యులుగా ఈ. వెంకటరావు, కట్టా సుధాకర్, ఎం. సంతోష్ రెడ్డి, ఆర్. నాగార్జున ఎన్నికయ్యారు. కొవిడ్ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆన్ లైన్ విధానంలో జరిగాయి.