Bankers Strike: దేశవ్యాప్తంగా రెండు రోజులపాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు పూర్తిగా మూతపడనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా ఈనెల 16, 17న బంద్ పాటించనున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ చేయకుండా నిలువరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత బ్యాంకర్ల సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో దాదాపు 70 వేల మంది పాల్గొంటున్నట్లు బ్యాంక్ యూనియన్ల ప్రతినిధులు తెలిపారు.
Bankers Strike: రెండు రోజులపాటు బ్యాంకులు బంద్.. ఎందుకంటే?
Bankers Strike: రాష్ట్రంలో రెండు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో బ్యాంకింగ్ చట్ట సవరణ చేయకుండా నిలువరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత బ్యాంకర్ల సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది.
Bank employees Dharna at koti: ఇవాళ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ కోఠిలోని ఎల్‌హెచ్‌ఓ ప్రాంగణంలో సమ్మె మొదలవుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలేటి నగేశ్వర్, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శ్రీరాంలు తెలిపారు. రేపటి సమ్మెలో బ్యాంకర్ల యూనియన్ ప్రతినిధులు పలువురు ఇందులో పాల్గొంటారని తెలిపారు. ఉద్యోగులంతా సమ్మెలో భాగస్వామ్యమవుతున్నట్లు వారు వివరించారు. ఎల్లుండి సికింద్రాబాద్‌లోని ప్యాట్నీ సెంటర్‌లోని ఎస్బీఐ ప్రాంగణలో బ్యాంకర్లు సమావేశమై సమ్మె చేస్తారని తెలిపారు.