తెలంగాణ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగానిది దుందుడుకు చర్యగా విమర్శించారు.
పోలీసుల అదుపులో తెలంగాణ భాజపా అధ్యక్షుడు - సిద్దిపేటలో పోలీసుల సోదాలపై బండి సంజయ్ ఆగ్రహం
తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ను సిద్దిపేట శివారులో ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలు జరుగుతుంటే సిద్దిపేటలో దాడులు, సోదాలు చేయడం ఎన్నికల నియమావళికి విరుద్దమన్నారు. తెలంగాణ ప్రభుత్వ పోలీసు యంత్రాంగానిది దుందుడుకు చర్యగా విమర్శించారు.
bandi sanjay
దాడి జరిగిన కుటుంబసభ్యులను కలవడానికి సిద్దిపేటకు బయలుదేరి వెళుతుండగా సిద్దిపేట శివారులో బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్‌కు తరలించారు. ఈ విషయంపై బండి సంజయ్ ఆగ్రహించారు. ఈ విధానాన్ని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.