ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రేటర్​ హీట్​: 2 గంటల్లోనే దారుస్సలాం నేలమట్టం చేస్తాం: బండి సంజయ్ - BJP State President Bandi Sanjay Latest Information

హైదరాబాద్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. ట్యాంక్‌బండ్‌పై దివంగత నేతలు పీవీ, ఎన్టీఆర్​ విగ్రహాలను కూల్చే దమ్ము మజ్లిస్‌కు ఉందా అని సవాల్ విసిరారు.

bandi-sanjay
bandi-sanjay

By

Published : Nov 25, 2020, 4:29 PM IST

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాజపా, మజ్లిస్‌ పార్టీల మధ్య మాటాల తూటాలు పేలాయి. నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న ప్రభుత్వానికి ధైర్యముంటే... ట్యాంక్‌బండ్‌పై పీవీ, ఎన్టీఆర్​ ఘాట్లను తొలగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సవాల్‌ విసిరారు. ఒవైసీ వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.

తెరాస చెప్పినట్లుగా ఆడే మజ్లిస్‌ పార్టీకి దమ్ముంటే.... పీవీ, ఎన్టీఆర్​ విగ్రహాలను కూల్చాలని సవాల్ విసిరారు. తాము తలుచుకుంటే రెండు గంటల్లోనే దారుస్సలాంను నేలమట్టం చేస్తామని హెచ్చరించారు.

రెండు గంటల్లోనే దారుస్సలాంను నేలమట్టం చేస్తాం: బండి సంజయ్

ఇదీ చూడండి:రేపిస్టులకు కొత్త శిక్ష- ఆ సామర్థ్యం ఖతం!

ABOUT THE AUTHOR

...view details