శ్రీరాముని జీవితమే మానవాళికి ఆదర్శమని.. అయోధ్యలో నిర్మాణమవుతున్న మందిరమే స్వాభిమాన సంకేతమని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. అయోధ్య రామమందిర నిధి సమర్పణలో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యులకు ఒక లక్ష రూపాయల నిధిని ఆయన విరాళంగా ఇచ్చారు.
అయోధ్య రామాలయ నిర్మాణానికి సమర్పణ చేసే.. అదృష్టం మన తరానికి రావడం పూర్వజన్మ సుకృతమేనని వెల్లడించారు. దేశంలోని ప్రతి కుటుంబం విరాళంతో అయోధ్య నిర్మాణం కావడం.. చారిత్రకమైనదని వ్యాఖ్యానించారు.