రైతుల కోసం కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay on KCR) నిలదీశారు. మూడేళ్లవుతున్నా రుణమాఫీ చేయలేదని.. ఎక్కడ రుణమాఫీ చేశారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత జిల్లా సిద్దిపేటలోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులు కార్లలో ఎక్కడ తిరుగుతున్నారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకసారి వరి వేయొద్దని, ఇంకోసారి పత్తి వేయొద్దని రైతులను ఆగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్పై తీవ్ర స్థాయిలో ఆయన (Bandi Sanjay on KCR) ధ్వజమెత్తారు.
ప్రతి గింజా నేనే కొంటా.. కేంద్రంతో పనేంటని కేసీఆర్ గతంలో అన్నారు. ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని కేసీఆర్ చెప్పదలచుకున్నారా.? ఏడేళ్ల నుంచి కేంద్రమే కొంటుందని అంటే.. కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. వానాకాలంలో పంట కొంటామని కేంద్రం చెప్పలేదని కేసీఆర్ చెబుతున్నారు. అక్టోబరు 21 నుంచి జనవరి 20 వరకు కొంటామని కేంద్రం చెప్పింది. ఆగస్టు 31న రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌సీఐ లేఖ రాసింది. ఎఫ్‌సీఐ లేఖ అందలేదని చెబితే నేను పంపుతా. దిల్లీకి వెళ్లి యుద్ధం చేస్తానని గతంలోనూ కేసీఆర్ హడావిడి చేశారు. -బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణకే అధిక వాటా..