Bandi Sanjay Petition: తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. కరీంనగర్ కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్‌ను కొట్టివేయాలని పిటిషన్లో ఆయన కోరారు. తనను వెంటనే విడుదల చేసేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని బండి సంజయ్ కోరారు. ఐపీసీ 333 సెక్షన్‌ను తర్వాత జత చేశారని.. దాన్ని కొట్టివేయాలని కోరారు.
Bandi Sanjay Petition: రిమాండ్ రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన బండి సంజయ్ - Bandi Sanjay arrested
Bandi Sanjay Petition: భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ హైకోర్టును ఆశ్రయించారు. తన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను వెంటనే విడుదల చేసేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు.
Bandi Sanjay Petition
అత్యవసరంగా లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టును మంగళవారం(జనవరి 4న) కోరారు. బండి సంజయ్ పిటిషన్ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ వద్దకు విచారణకు వచ్చింది. అయితే ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసులు తన పరిధిలోకి రావాని... జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బెంచ్‌కు పంపించాలని రిజిస్ట్రీని జస్టిస్ లక్ష్మణ్ ఆదేశించారు.
ఇదీ చూడండి: