రాష్ట్రంలో వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం వదిలి బయటకు రావడం లేదని మాజీమంత్రి, తెదేపా నేత బండారు సత్యనారాయణ మూర్తి విమర్శించారు. పదవి దక్కాక అందరూ అంటరాని వారయ్యారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుద్ హుద్, తిత్లీ తుపాన్లు వస్తే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల మధ్యే ఉండి పని చేశారని గుర్తు చేశారు.
'వరదలు ముంచేస్తుంటే.. సీఎం బయటకు రారా?' - ఏపీలో వర్షాలపై వార్తలు
రాష్టంలో వరదలు ముంచెత్తి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వాాపోయారు. సీఎం జగన్ ఇవేమీ పట్టించుకోకుండా క్యాంపు కార్యాలయంలో కూర్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి