మావోయిస్టు పార్టీ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై మరో ఏడాదిపాటు నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టు పార్టీతో పాటు దాని అనుబంధ సంస్థలైన రివల్యూషనరీ డెమొక్రాటిక్ ఫ్రంట్, రైతు కూలీ సంఘం, రాడికల్ యూత్ లీగ్, సింగరేణి కార్మిక సమాఖ్య, విప్లవ కార్మిక సమాఖ్య, ఆల్ ఇండియా రివల్యూషనరీ స్టూడెంట్స్ ఫెడరేషన్ తదితర సంస్థలపై మరో ఏడాదిపాటు నిషేధాన్ని పొడిగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం పొడిగింపు - AP Government latest decisions
రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ, కార్యకలాపాలపై మరో ఏడాదిపాటు ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఏడాదిపాటు నిషేధం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
మావోయిస్టు పార్టీపై మరో ఏడాది నిషేధం పొడిగింపు
ఆగస్టు 17 తేదీ నుంచి ఏడాది పాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టం 1992 కింద ఈ సంస్థల కార్యకలాపాలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది.
ఇదీ చదవండీ...'వైఎస్ఆర్ ఆసరా'కు సీఎం జగన్ శ్రీకారం
Last Updated : Sep 11, 2020, 5:29 PM IST