లోక్సభకు స్పీకర్గా విశేష సేవలు అందించిన తెదేపా నేత జీఎంసీ బాలయోగి 18వ వర్థంతిని అమరావతి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు ప్రశ్నాపత్రం లీకేజీపై ఆరోపణలు వస్తే.. బాలయోగి వెంటనే రాజీనామా చేశారని గుర్తుచేశారు. తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధిలో అడుగడుగునా బాలయోగి ముద్రలు కనబడతాయని కీర్తించారు. ఆయన ఆశయ సాధనకు తెదేపా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కృష్ణా జిల్లా గొల్లపూడిలో..
బాలయోగి వర్థంతిని గొల్లపూడిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెదేపా నేతలతో కలిసి చిత్రపటానికి నివాళులర్పించారు.